Rajitha Reddy Gaddam profile
Rajitha Reddy Gaddam
34 1 0
Posts Followers Following
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - గురువు అంటే…
జ్ఞానాన్ని పంచడంతో పాటు 
జీవితాన్ని మార్చే వెలుగు.
పాఠాన్ని చెప్పడంతో పాటు జీవిత పాఠాన్ని నడిపించే మార్గదర్శిని.
అభ్యాసాన్ని నెరవేర్చే శిక్షకురాలు మాత్రమే కాదు,
 సంశయాలను తొలగించే జ్ఞాన దీప్తి.
గురువు అంటే…
నిరంతరం విద్యార్థుల కోసం ఆలోచిస్తూ, ప్రేరణనిచ్చే ఆత్మయోగి.
ప్రతీ విజయానికి పునాది వేసే మౌన శిల్పి.
!!గురుపూర్ణిమ శుభాకాంక్షలు!!

                రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ఎందుకీ ఆరాటం, ఏమిటా ఉబలాటం.
కాదేది శాశ్వతం,  లేదేది మానవత్వం.
                   అయినా
ప్రతి పనికై పోరాటం, ప్రతి పదవిపై అధికారం
నేనే గొప్ప అనే అహంకారం
తానే అంతా అనే అహంభావం
ఎందుకీ సంకుచిత స్వభావం 
ఏమిటా మనసంతా స్వార్థం
ఎన్నాళ్లిలా స్వలాభం,ఏమిటా అకృత్యం
మారండి మనుషుల్లారా;
మారండి మానవత్వం గల మనుషులుగా.
rajithaa reiddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - మనసంతా స్వార్థం
మదినిండా కపటం
పైకి మాత్రం హాస్యం 
లోలోన నమ్మకద్రోహం
పరులు బాగుపడితే ఓర్వలేనితనం
 ఏదో తెలుసుకోవాలని ఆరాటం
అది ఇతరులకు చెప్పాలని ఆత్రం
అవసరానికి వాడుకునే గుణం
పరుల గెలుపు వారికి అసహనం
 ఎప్పుడూ వారితో ప్రమాదకరం
 ఎప్పుడు ఉండండి వారితో దూరం.

Quote by Rajitha Reddy Gaddam - వ్యక్తి స్పష్టమైన ప్రమాణాలు కలిగి ఉన్నా,
 అంచనా వేసేవాళ్ళు తప్పుగా అంచనా వేస్తే,
 స్పష్టమైన ప్రమాణాన్ని కించపరిచినట్టే!
ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవలసిన అవసరం ముమ్మాటికీ ఉంది!

                        rajitha - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ఓర్పు, సహనం, త్యాగం,
పట్టుదల, ఆప్యాయత, సంకల్ప బలం, 
మాతృత్వం మహిళ సహజ లక్షణాలు!!
వీరనారిగా, పాలకురాలిగా, 
ఆలిగా, అమ్మగా, అంతరిక్షకురాలుగా, అధికారిగా, సైనికురాలిగా, సమాజ సేవకురాలిగా, విద్యావంతురాలిగా, యజమానిరాలుగా, వ్యాపారవేత్తగా  - పోషించును బహు పాత్రలు.
ఆ విలువైన పాత్రలను
పోషించే మహిళలు సమాజ నిర్మాణానికి కారకులు!
స్త్రీ అబల అనే వాళ్లకు
ధీటుగా సబల అని నిరూపించిన వనితలు 
ప్రపంచావనికి వెలుగు బాటలు!!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!
                        !!రజిత!!
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - నాటి యువరాణులం, 
నేటి మహరాణులం.
రేపటి రాజమాతలం!!

ఓర్పులో భూదేవిలం 
కదన రంగంలో వీరనారులం
పరిపూర్ణతకు  ప్రతిరూపాలం
విజయానికి మార్గం చూపే ప్రగతి  పథకులం

 సమాజానికి వెలుగులు పంచే దీపాలం 
సంకల్పంలో శక్తి స్వరూపులం. 
ప్రేమలో చెరగని చంద్రికలం
మహిళలం, మహిమాన్వితులం
                               !!రజిత!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ఓర్పు, సహనం, త్యాగం,
పట్టుదల, ఆప్యాయత, సంకల్ప బలం, 
మాతృత్వం మహిళ యొక్క సహజ లక్షణాలు
వీరనారిగా, పాలకురాలిగా, 
ఆలిగా, అమ్మగా, అంతరిక్షకురాలుగా, అధికారిగా, సైనికురాలిగా, సమాజ సేవకురాలిగా, విద్యావంతురాలిగా, యజమానిరాలుగా, వ్యాపారవేత్తగా  - పోషించును బహు పాత్రలు.
ఆ విలువైన పాత్రలను
పోషించే మహిళలు సమాజ నిర్మాణానికి కారకులు
స్త్రీ అబల అనే వాళ్లకు
ధీటుగా సబల అని నిరూపించిన వనితలు 
ప్రపంచావనికి వెలుగు బాటలు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 
            రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - నీ దగ్గర ఉన్నదాన్ని చూసి తృప్తి పడు.
లేదా 
దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించు.
అంతే కానీ 
ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి అసూయచెందకు, కావాలని కోరుకోకు.
నీకు నిరాశ, నిస్పృహ, మనస్తాపం తప్ప ఒరిగేమి లేదు.
                                                 !రజిత! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - వెటకారంతో ఇతరులను 
కించపరచడం
అహంకారంతో ఇతరులను అవమానపరచడం,
పదవీ గర్వంతో ఇతరులకు మర్యాద ఇవ్వకపోవడం
బాధ్యతారాహిత్య లక్షణాలు.
చుట్టూ ఉన్నవాళ్ల సంతోషానికి ఆటంకాలు
                                                      !రజిత! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - బంతిపూల అలంకరణలతో గుమ్మాలు
రంగవల్లులతో ముంగిళ్లు,పాల పొంగులతో లోగిళ్ళు
పతంగులతో           నింగి హరివిల్లు
      భోగిపళ్ళతో                   చిన్నపిల్లల బోసినవ్వులు
నోములు నోచుతూ        నారీమణులు 
కళకళలాడెను తెలుగు లోగిళ్ళు
మది నిండా సంక్రాంతి పర్వదిన పరవళ్ళు
ప్రకృతితో ముడిపడిన పండుగ 
☀️ 🌞 పల్లె జీవితానికి అద్దం పట్టే పండుగ 🪁 🪁 
!!రజిత!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - అనుమానం పెనుభూతం.
అది పట్టి పీడిస్తుంది.
ఈర్ష్య, అసూయ స్వీయ విధ్వంసక భావోద్వేగం.
అది నాశనానికి కారణం అవుతుంది.
                              !rajitha! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam -  గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలికి,
 రాబోయే సంవత్సరాన్ని స్వాగతించి,
గడిచిన కాలం ఇచ్చిన మధుర స్మృతులను నెమరువేసుకుంటూ,
కొత్త ఆశలతో, ఆశయాలతో నూతన సంవత్సరం లోకి అడుగుపెడుతూ,
 నూతన సంవత్సర వేడుకలు ఒక పరిధిలోనే జరుపుకుంటూ,
మంచి వైపు అడుగులు వేసే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ,
కొత్త సంవత్సరం అనేది కొత్త అధ్యాయానికి నాంది కావాలని కోరుతూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
                                                      !!Rajitha!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - వీడ్కోలు గడిచిన సంవత్సరానికి,
స్వాగతం రాబోయే సంవత్సరానికి.
గడిచిన కాలం ఇచ్చిన మధుర స్మృతులను నెమరువేసుకుంటూ,
కొత్త ఆశలతో ఆశయాలతో నూతన సంవత్సరం లోకి అడుగుపెడుతూ,
 నూతన సంవత్సర వేడుకలు ఒక పరిధిలోనే జరుపుకుంటూ,
మంచి వైపు అడుగులు వేసే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ,
కొత్త సంవత్సరం అనేది కొత్త అధ్యాయానికి నాంది కావాలని 
నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
                                             !!Rajitha!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - జీవితమనేది పోరాటమా?
లేక ఆటనా?
పోరాటం అయితే యుద్ధం చేసి గెలవాలి. 
ఆట అయితే ఆడి గెలవాలి. 
అంతే కానీ గెలవలేక
 వంచనతో, మాయ మాటలతో, 
గెలవాలని ప్రయత్నించవద్దు. 
ఎంత ప్రయత్నించినా చివరకు విజయం
 న్యాయం, ధర్మం వైపు మాత్రమే!!
           !రజిత! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - శివకేశవులకు ప్రీతికరం 
హరిహారాదులకు ప్రీతిపాత్రం.
పుణ్య నదీ స్నానాలు,
దీప దానాలు,
తులసి కళ్యాణాలతో
మారుమ్రోగిన మాసం
కార్తీకం
 వేకువ జామున వెలిగిన దీపం
భక్తులందరికి  కలిగెను మోక్షం.
జనులంతా భక్తి మార్గంలో 
           పయనించే రోజు కార్తీక పౌర్ణమి 🙏🙏
!!రజిత!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - శివకేశవులకు ప్రీతికరం 
హరిహారాదులకు ప్రీతిపాత్రం.
పుణ్య నదీ స్నానాలు,
దీప దానాలు,
తులసి కళ్యాణాలతో
మారుమ్రోగిన మాసం
కార్తీకం
ప్రతి ఇంట వేకువ జామున వెలిగిన దీపం
ప్రతి ఒక్కరికి కలిగెను మోక్షం.
జనులంతా భక్తి మార్గంలో 
పయనించే రోజు కార్తీక పౌర్ణమి
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
                !రజిత! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - మన బలహీనతల్ని ఒక పావుగా వాడుకొని
ఇతరుల నుండి జాలి, దయ సంపాదించటం
చేతకానితనానికి, అభద్రతా భావానికి నిదర్శనం
                       !రజిత! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ఎంత ఎత్తుకు ఎదిగినా
మంచి, మర్యాద, మాట్లాడే విధానం తెలియకపోవటం
గౌరవప్రదమైన స్థానానికి అవమానకరం
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - మన బలహీనతల్ని ఒక పావుగా వాడుకొని
ఇతరుల నుండి జాలి, దయ సంపాదించటం అనేది
చేతకానితనానికి, అభద్రతా భావానికి నిదర్శనం. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - దీపాల వరుసతో ముంగిళ్లన్ని కళకళ .
టపాసుల సందడితో లోగిళ్ళన్ని గలగల.
లక్మి పూజలతో  గృహాలన్నీ నమోనమః
అసుర సంహారం
ధర్మ సంస్థాపనం
చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ
కలిగించిన 
దివ్య దీప్తుల దీపావళి🌋
మానవాళికి శుభాలనిచ్చే శోభావళి🎇
                                 !!రజిత!!
                - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - దీపాల వరుసతో ముంగిళ్లన్ని కళకళ .
టపాసుల సందడితో లోగిళ్ళన్ని గలగల.
లక్మి పూజలతో  గృహాలన్నీ నమోనమః
చీకటిపై కాంతి, చెడుపై మంచి, 
నిరాశపై ఆశ
కలిగించిన 
దివ్య దీప్తుల దీపావళి!!
మానవాళికి సంతోషాన్నిచ్చే శోభావళి!!
                         రజిత - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - అనుక్షణం విద్యార్థుల భవితవ్యం కోసం 
తపనపడే ఋషి !
అనునిత్యం విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయడం కోసం తహతహలాడే ముని !
ఎప్పుడు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఆరాటపడే తాపసి!
ఎల్లప్పుడూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి కృషి చేసే మహర్షి! 
విద్యా నైపుణ్యాలతో పాటు జీవితానుభవసారాన్ని బోధించే 
ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!!
!రజిత! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - అనుక్షణం విద్యార్థుల భవితవ్యం కోసం 
తపనపడే ఋషి !
అనునిత్యం విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయడం కోసం తహతహలాడే ముని !
ఎప్పుడు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఆరాటపడే తాపసి!
ఎల్లప్పుడూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి కృషి చేసే మహర్షి! 
విద్యా నైపుణ్యాలతో పాటు జీవితానుభవసారాన్ని బోధించే ఉపాధ్యాయిని వెరసి
ప్రెసిడెన్సీ పాఠశాల వ్యవస్థాపకురాలికి
 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!!
!రజిత! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - అనుక్షణం విద్యార్థుల భవితవ్యం కోసం తపనపడే ఋషి !
అనునిత్యం విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయడం కోసం తహతహలాడే ముని !
ఎప్పుడు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఆరాటపడే తాపసి!
ఎల్లప్పుడూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి కృషి చేసే మహర్షి! 
విద్యా నైపుణ్యాలతో పాటు జీవితానుభవసారాన్ని బోధించే 
ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!!
!రజిత! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ప్రాచీన భాష, అజంత భాష
అజరామరమైన భాష
ఉత్తమ లిపిగా ఎంపికైన భాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలువబడే భాష
అదే అదే మన తెలుగు భాష
నుడికారములకు, పద బంధములకు నెలవు
జాతీయములకు, సామెతలకు కొలువు
శతకాలకు, ఇతిహాసాలకు ఆవాసం
పురాణములకు,  ప్రబంధాలకు ఆలవాలం
అవధానాలకు, అలంకారాలకు ఆదరువు
 తెలుగు మాట సుమధుర సారం,
తెలుగు పాట సుస్వర భరితం 
గిడుగు వారి కృషి ఫలమే, 
నేటి వచన భాష లభ్యమే!!
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు💐💐
రజిత!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - వేదాలను విభజించి 
పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి
అష్టాదశ పురాణాలను లిఖించి 
మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి
విశ్వానికి గురవయ్యాడు వేద వ్యాసుడు.
ఆ గొప్ప గురువును స్మరిస్తూ
గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🙏
rajitha - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - నా జీవితంలో అత్యంత ప్రభావం చూపి 
అమూల్యమైన జ్ఞానాన్ని అందించి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించిన గురువులందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు🙏🙏
రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ప్రెసిడెన్సీ గురువుకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు
ప్రెసిడెన్సి గురువుగా
 మీరు చూపిన మార్గం 
మీరు నేర్పిన జ్ఞానం 
మీరు ఇచ్చిన స్ఫూర్తి 
విద్యార్థుల విజయానికి నాంది.
మీరు చూపించే ఆదరణ 
మీరు కలిగించే ప్రేరణ
 విద్యార్థుల ఉజ్వల జీవితానికి అంకురార్పణ
సర్వదా కృతజ్ఞులం🙏🙏
                   రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - ఎందుకో ఒక్కోసారి మనసు బలహీనమవుతది!
ఎందుకో ఎద లోతుల్లోంచి దుఃఖం తన్నుకువస్తుంది!
మనసుకు తాకిన గాయాల వల్లనో!
ఇతరులు చూసిన చిన్న చూపు వల్లనో!
నిన్ను నువ్వు తట్టి లేపుకో
నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా 
ముందుకు సాగిపో.
                             రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - రంగు రంగుల హోలీ
ఆనందాల ఉత్సాహాల కేళి
హోళికా దహనమైన రోజు హోలీ
చెడు సంహారమైన రోజు హోలీ
తారతమ్యాలు మరిచి ఆడిరి హోలీ
సంబరాలు జరిపిరి ప్రతి ముంగిలి
ఉత్సాహంతో ఉరకలు వేసిరి
ఒకరిపై ఒకరు రంగులు చల్లిరి
చేతిలో రంగులు కురిసే హరివిల్లులై
పుడమంతా సప్తవర్ణ శోభితమై!!
                                            రజిత - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - తన మేధస్సుతో ఇతరులను అంచనా వేయగలరు కొందరు.
కాని అలాంటి వారినే వెన్నుపోటు పొడుస్తూ, వారి ముందు నటిస్తూ ఉండే వారిని మాత్రం గుర్తించలేరు.
ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
                                                           రజిత! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - కొంత మందికి ఇతరుల గొప్పదనాన్ని పొగడడం అనేది  అహం
ఆ పొగడ్త ద్వారా వాళ్ళ మనసును గెలుచుకోవచ్చు
అనేది వాళ్లకు తెలియని నిజం
                                   
                                            !!రజిత!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Rajitha Reddy Gaddam
Quote by Rajitha Reddy Gaddam - మనతోనే ఉంటారు కానీ 
కారు మన శ్రేయోభిలాషులు.
మన ప్రాధాన్యత పెరిగితే చూసి
ఓర్వలేరు ఎందుకంటే వారు ఈర్ష్యాపరులు.
ఇలాంటి వారు ఉంటారు మన చుట్టూ ప్రతినిత్యం
కాపాడుకో చాకచక్యంతో నిన్ను నువ్వు అనునిత్యం.
                                       "రజిత" - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments