Srinivas Kunchala profile
Srinivas Kunchala
21 0 0
Posts Followers Following
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - వీణాపుస్తకధారిణి తల్లి సరస్వతీ
సకల విద్యాధిదేవతగ పూజలందుకొంటున్న వాగ్దేవి 
శాంతమూర్తివి, తెలుపువర్ణం నీ హృదయము
వాక్కు శక్తిని ప్రసాదించే హంసవాహిణి 
నీ కృపను అందిచవే శ్యామలాంభికా 
ప్రవహించినది బ్రహ్మనారి నధీమతల్లిగా
కటాక్షించుగ జలధారిణి మూడు మునకలే వేయగా 
అమ్మ భారతీ నీ ప్రభావము ముల్లోకాలైన ఎరుగున 
పరమేశ్వరిలో భాగమే నీవుగా 
పాలించవే అక్షరాలను పద్మాసిని.... 
కలిగించవే నీ ఉనికిని జ్ఞానప్రదాయిని....  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ప్రేమలో ప్రేమనై ప్రేమించే ప్రేమికుడినై ప్రేమ కోసం వెతుకుతున్న నా ప్రేమ నీ మనసును తాకి ప్రేమను చిగురింప చేసింద???  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - గడిచిన నిన్నటిలో  నిజం ఎంత ఉందో అని గమనిస్తే 
ఈరోజులో ఉండలేక పోతున్నాను 
అన్ని తొందర నిర్ణయాలు మనసుకు సర్దిచెప్పుకొని కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది 
అయిన ఎన్ని అనుకున్న జరిగిపోయింది తిరిగి వస్తుందా 
ఇకపై ఆ తప్పులను మళ్లీ చేయకూడదు..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ఏమో  గుండెల్లో భారంగా అనిపిస్తుంది
ఒక్క క్షణం కాలం ఆగిపోతే వెను తిరిగి జీవితాన్ని సరిదిద్దాలని ఉంది....... 
ఏమొ తెలియని ఒక యాతన అది చెప్పుకోడానికి ఎవ్వరూ లేరు నా పక్కన 
చూస్తూన్న నీకోసం,  నిన్ను తలవని క్షణం లేదు కాని ఈ విషయాలు నీతో చెప్పేలోపే ఆ భారం నన్ను ముంచేస్తుందేమొనని చిన్న భయం.. 
  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - నిజంగా కాగితం చాలా గొప్పదండి... 
కాగితానికి తెలియదు దాని మీద ఏ పదాలు ఉన్నాయోనని... 
రాసే కలానికి గాని అక్షరాలను మోసే కాగితానికి గాని తెలియవు....అవి ఎంత అందమైన భావాలు కావచ్చు, చేదు అనుభవాలు కావచ్చు, మంచి జ్ఞాపకాలు కావచ్చు, సందేశాత్మక రచన ఏదైనా కావచ్చు ఇతరులకు పంచుతున్నాయని.. 
మనసులో నుండి జాలువారిన అక్షరాలు పదాలుగా కాగితంపై రూపుదాల్చిన క్షణాన.... 
తిరిగి రాసిన వ్యక్తి ఓసారి మళ్లీ వాటి వంక చూస్తే వచ్చే ఆనందం... 
తన కళ్ళ నుండి వచ్చే కనీళ్లే దానికి సాక్ష్యం... 

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - నే కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెనుక చెప్పుకోలేని ఎంతో బాధ ఉంది 
నా మనసులో దాచుకోలేనంత ప్రేమ కన్నీటి రూపంలో బయటకి వస్తుంటే అది అర్థం చేసుకోలేని నీ అమాయకపు కళ్లు నా వంక దీనంగా చూస్తుంటే 
నా పెదవి తత్తరపాటుతో నా మనసులోని భావాలను నీకు చెప్పడానికి తొందరపడుతుంటే  అది తెలుసుకోలేని నీ హృదయం నా నుండి దూరంగా వెళ్లిపోతుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ప్రతి ఒక్కరు అనుకుంటారు వాళ్ళ ప్రేమ గొప్పది అని మాటల్లో ఎన్నో చెప్పొచ్చు పదాల్లో ఎన్నో రాసి చూపించచ్చు కాని నా దగ్గర మాటలు లేవు నీ గురించి రాద్దామంటే అక్షరాలు సరిపోవట్లేదు 
ఏది లేదు ఏమి తెలియదు ఒక నువ్వు నీ చిరునవ్వు తప్ప...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - అక్షరం అందంగా ముస్తాబయ్యింది నీ గురించి అల్లుకుపోదామని ... 
వర్షం చినుకు మురిసిపోతుంది నీ మేను తాకి మోక్షం పొందుదామని ... 
మొగ్గ ఆశ పడుతుంది త్వరగా విచ్చి నీ జడలో చేరదామని ... 
నా మనస్సు ఉవ్విలూరుతుంది నీ మనసుతో చేరి ఎన్నో ఊసులు చెప్పాలని ... 
నా కళ్లు ఆరాటపడుతున్నాయి నా స్వప్నంలోకి వచ్చే మన ప్రేమ నిజమవ్వాలని....  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - అంగీకరించే మనసుంటే చాలు ఎంతటి కష్టమైన ఇష్టంగా మారిపోతుంది..... 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ఓ చిత్రమైన చిత్తమా...!!!! చితిమంటను చేరేవరకు చిగురించెను నీలో ఎన్నో కోరికలు 
రోజు రోజుకు శిథిలమైపోతున్న ఈ దేహంలో ఉంటూ నిత్యయవ్వనంతో ఉరకలు పరుగులు తీస్తావు 
అందని ఆశ అని తెలిసినా ఒదిగి ఉండక 
అందుకోవడం కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తావు 
ఓ పక్క నుండి అన్ని చూస్తూ, తెలుసుకుంటూ 
ఏది శాశ్వతం కాదు అనుకుంటూనే ఏదోక దాని మీద మనసు పడతావు......  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - కాలంతో ముందుకు సాగడం తప్ప ఏమి చేయలేం
ఈ క్షణాన నువ్వు బాధలో మునిగిపోయి ఉండచ్చు 
కాని అలసిపోకుండ నీ ఊపిరిని ఏమాత్రం ఆగకుండ చూడు 
ఏదో ఒక రోజు అంత ఇమిడిపోయి నువ్వే తేలుకుంటూ ముందుకు నడుస్తావు ఈ నమ్మకం నీలో ఉంచు..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - నువ్వు ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా 
సమస్య అని కూర్చుంటే అది సమస్యగానే మిగులుతుంది 
ఓసారి ప్రయత్నించి చూడు కనీసం నీకు దారైనా కనబడుతుంది..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - అనుక్షణం నీ గురించే ఆలోచించే నా బుర్ర ఒక్కసారి ఆగిపోయి తన గురించి 
ఆలోచించడం మొదలు పెట్టింది 
బ్రతుకు ప్రశ్నల్లే మారింది 
పయనం ముందుకు సాగనంటుంది... 
కాని ఎలాగైనా పోరాడి ముందుకు నడుపుతుంది 
మనం ఆగిపోయిన కాలం ఆగదు కదా..! 
ఇక జీవిస్తున్న అంటే జీవిస్తున్నా.........  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ఎందుకో ఈ ఆరాటం..... !!! 

ఒకరేమొ మరొకరి పొందుకోసం
మరొకరేమొ ఇంకొకరి మెప్పు కోసం 
మొత్తానికి అందరికి ఏదో ఓ ఆరాటం.. 
చివరికి అంతా శూన్యమే అని తెలిసి కూడా అది ఎప్పుడో వస్తుందిలే అనే భావనను పెడచెవిన పెట్టి ఈ మూనళ్ళ ముచ్చట కోసం అనుదినం అలుపెరగని పోరాటం  అనవసరమైన స్వార్థం అనే అలంకారం..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - కదులుతున్న కాలంలో ఎన్ని మార్పులో మార్పు లేని జీవితం ఏది? 
ఈ మాయకు అసలు కారణం తెలియకుండానే పరిగెడుతున్నాం 
ఏది నిజం..,
ఎంతవరకు ఈ పయనం....  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - నేను పాడుకున్న ప్రతి పాటలో పల్లవి నీవైతే
......... చరణం నేను
నే రాసుకున్న ప్రతి కవితలో అక్షరం నీవైతే
........... కలం నేను
చంద్రుని కిరణాలతో వికసించే తామర నీవైతే
........నీటి బిందువును నేను
మనసులోని దాగి ఉన్న ప్రేమ నీవైతే
........ చెప్పుకోలేని బాధ నేను - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - నీతో గడిపిన ఆ క్షణాలు .. 
నన్ను నీలో చూసుకున్న సందర్భాలు .. 
వెళ్లిన ప్రతి చోట సువాసనలతో పలకరించే పూలు.. 
నువ్వే ఏమో అనుకునే నా మనసు... 
నన్ను నన్నే మరిపించేలా ఆ జ్ఞాపకలు.. 
నిన్ను తలుచుకుంటే గుర్తొచ్చే కన్నీళ్లు .. 
ఇక నువ్వు దూరమయ్యాక వదలాలనిపించే నా ప్రాణాలు..  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - గడిచిన నిన్నటి కంటే విలువైనది రేపు గొప్ప.. 
నిన్న చేసిన తప్పుని నేడు ఆలోచించి రేపు సరిదిద్దు. . 
అంతా మనవాళ్లే అని మోసపోవడం ఎంత సులువో.. 
నీ మనసు నీ మాట విననంటుంది అంతే మూర్ఖత్వంతో.. 
ప్రతి పని చేయు నేర్పుతో రేపు నిన్ను చూసి అందరు అన్నాలి జయహో...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - కనీళ్లతో సహవాసం చేస్తూ... 
బాధతో కాలక్షేపం చేస్తూ.. 
ఆటంకాలతో అనుబంధం పెంచుకుంటూ... 
ఓటమితో ప్రతిక్షణం గడుపుతూ.. 
ఎదురుదెబ్బల గాయాలతో నిత్యం నడుస్తుా.. 
కొత్త ప్రశ్నలతో అనుదినం సతమతమవుతుా.. 
ఆపద అనే అస్త్రం అనుక్షణం విరిగిన గుండెలో గుచ్చుకుంటూ.. 
నిరాశ అనే ఎడారిలో గాలికి దీపంలా వెలుగుతున్నా.. 
కానీ చిరునవ్వు అనే ముసుగుని ఎల్లప్పుడుా ధరించి ఈ సిగ్గులేని సమాజంలో బ్రతుకుతున్నా..  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - పరిమళించే పువ్వుకి తెలియదు అది ఎవరో తెంపడానికి పుట్టిందని... 
తనలో నీటిని నింపుకున్న మేఘానికి తెలియదు అది చినుకు రూపంలో నేలకు చేరుతుందని.. 
మండే మంటకు తెలియదు అది నీటి చెమ్మకు అరిపోతుందని... 
ఎగసిపడే అలలకు తెలియదు తన ఆనందం నీళ్లు ఉన్నంతవరకేనని.. 
రెక్కలు కట్టుకొని ఎగిరే మనసుకి తెలియదు ఈ ప్రేమ నమ్మకం ఉన్నంతవరకేనని.. 
అలసిపోయిన నా గతానికి తెలియదు ఆ మైకంలో రేపంట్టు ఒక గమ్యం ఉందని... 
అయిన ఏది జరిగినా ఆగకు అంటూ వెన్ను తట్టి నడుపుతుంది నా మది...  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

Srinivas Kunchala
Quote by Srinivas Kunchala - ఆకాశాన్ని ఆకారముగా చేసుకుని అర్థనారీశ్వర రూపమున మీ దంపతులు... 
ఆట వస్తువుగా చేసుకున్న ఈ భువిని, ఇందులో ప్రతి ఒక్క జీవి మీ ఆటలో ఓ పావు కదా... 
ఆటని ఆరంభించాలన్నా... ముగించాలన్నా అంతా నీ చేతిలోనే కదా ఈశ్వరా,,,... 
ఇందులో ఉండే ప్రతి ఒక్క పావుకి బంధం అనే త్రాడును కట్టి ముందుకు నడిపించే మృత్యుంజయ.. 
అందులో ఎన్నో పావులను మధ్యలోనే తీసేస్తావు... 
ఓ పావు మరో పావును ఓడించాలని ముందుకు వెళ్తుంది దాన్ని పక్కన పడేస్తావు.. 
ఈ పావులను నీవు సృష్టించావు అన్న సంగతి ఆ పావులు మరచిపోయేలా చేసి పావులను కదుపుతావు... 
అదంతా చూసి నీవే మురిసిపోతావు భోళాశంకరా...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments